
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరవుల దుకాణం తనిఖీ చేసి,రికార్డు నిర్వహణ సరిగా లేనందున, ఈపీఓఎస్ మరియు స్టాక్ రిజిస్టర్ నందు స్టాక్స్ వేత్యాసం ఉండటం వలన 4,09,159 రూపాయలు విలువ గల ఎరువుల స్టాక్ ని 15 రోజులు అమ్మకాలు నిలుపదల చేయమని ఆదేశించామని, జగ్గంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదేశానుసారం సీఈఓ కు షోకాస్ నోటీసు ద్వారా సంజాయిషీ కోరడం జరిగిందని ఆయన తెలిపారు.