మన ధ్యాస, నెల్లూరు, ఫిబ్రవరి 6 :వృత్తి రీత్యా వీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల ఏడు మాసాలు పూర్తి చేసుకున్నారు. 09 ఆగస్టు 2012 నుంచి 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు నందు కేర్ టేకర్ ఆఫీసర్ గా 27 అక్టోబర్ 2013 వరకు సేవలందించారు. 28 అక్టోబర్ 2013 నుంచి థర్డ్ ఆఫీసర్ హోదాలో 01 డిసెంబర్ 2021 వరకు విశేషసేవలందించారు. 02 డిసెంబర్ 2021 నుంచి సెకండ్ ఆఫీసర్ హోదాలో తన వంతు సామాజిక బాధ్యతగా సమాజాన్ని చైతన్య పరిచే పలు ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి,పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి పెంచి పెద్దచేశారు.పునీత్సాగర్ అభియాన్, స్వచ్ఛతాహి సేవ, స్వచ్ఛభారత్ అభియాన్, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ బాలిక దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ప్రపంచ నదుల దినోత్సవం, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే, గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి, జాతీయా ఏకతా దివస్, కార్గిల్ విజయ్ దివస్, ఎన్సిసి డే, ఇండియన్ నేవీ డే, ఏక్ గంట ఏక్ దిన్ శ్రమదాన్ కార్యక్రమం, వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, వరల్డ్ క్యాన్సర్ డే ర్యాలీ, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహించిన ర్యాలీ, ఆపరేషన్ సింధూర్ అవగాహన సదస్సు, వందేమాతరం జాతీయ గేయం రచించబడి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమం, యాంటీ టొబాకో డే, యాంటీ డ్రగ్స్ డే, రహదారి భద్రత వారోత్సవాల ర్యాలీ, ఫిట్ ఇండియా 3 కి.మీ.రన్, సాయిధర్ దళాల పతాక దినోత్సవ నిధి విరాళాల సేకరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కేరళ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో 77,000 ప్రజల నుంచి విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ద్వారా డిడి రూపంలో పంపించారు.నిత్యం ప్రజలను చైతన్య పరుస్తూ తన విశిష్ట సేవలు ద్వారా జిల్లా అధికారుల ప్రజల మన్ననలు పొందిన గుండాల నరేంద్రబాబు ఎన్సిసి క్యాడేట్లలో దేశభక్తి సేవా భావం క్రమశిక్షణ జాతీయ సమైక్యత పోరాటపటిమ, సహకార గుణం నాయకత్వ లక్షణాలు, శ్రమ విలువ మొదలైన లక్షణాలను ఎన్సిసి అధికారిగా చక్కటి శిక్షణనిస్తూ వారిని భావి భారత సైనికులుగా తీర్చిదిద్దుతున్నారు. పలు సందర్భాలలో జిల్లా ప్రముఖులతో జిల్లాఉన్నతాధికారులతో నరేంద్రబాబు చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వాములై విశిష్ట సేవలు అందజేసి అధికారుల అనధికారుల మన్ననలు పొందారు. ఎన్సిసి ఆఫీసరుగా వీరు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్సిసి డైరెక్టరేట్ స్థాయిలో ఎన్సిసి బెస్ట్ ఆఫీసర్ అవార్డును 2024 -25 సంవత్సరానికి గాను హైదరాబాదులోని ప్యారీసన్ డిఫెన్స్ గ్రౌండ్ నందు నిర్వహించబడిన ఎన్సిసి దినోత్సవ వేడుకల్లో ఎన్ సి సి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమడోర్ వి. మధుసూదన్ రెడ్డి నుంచి 24 నవంబర్ 2024న అందుకోవడం వీరి విశిష్ట సేవలకు నిదర్శనం.భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రస్తుతం సెకండ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న గుండాల నరేంద్ర బాబు 08 నవంబర్ 2025 నుంచి ఫస్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారని 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి, నెల్లూరు లెఫ్టనెంట్ కమాండర్ గణేష్ గొదన్గవే కమాండింగ్ ఆఫీసర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారని నరేంద్ర బాబు ఓ ప్రకటనలో తెలియజేశారు.తెలుగు ఉపాధ్యాయినిగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని తెలుగు భాష ఎడల అభిమానాన్ని అభిరుచిని ఆసక్తిని అనురక్తిని పెంపొందిస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ విద్యాశాఖ అధికారుల తల్లిదండ్రుల విద్యార్థుల మన్ననలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2022లో సెప్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలోఅందుకున్నారు.అంతేకాకుండా గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అప్పటి జిల్లా కలెక్టర్లు 2011లో కే. రామ్ గోపాల్ ఐఏఎస్,,2020లో ఎం.వి. శేషగిరి బాబు ఐఏఎస్, 2024 లో ఎం.హరి నారాయణన్ ఐఏఎస్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండాల నరేంద్రబాబు విభిన్న రంగాలలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గణతంత్ర దినోత్సవ పురస్కారాన్ని అందజేసి అభినందించారు.నేడు పదోన్నతి పొందిన ఉత్తర్వులు అందిన సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి. మంజులవాణి, ఉపాధ్యాయులు, ఎన్సిసి లెఫ్ట్నెంట్ కమాండర్ గణేష్ గొదంగవే, ఇతర ఎన్సిసి అధికారులు నరేంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *