మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు డాక్టర్ రామస్వామిని కలసి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. డాక్టర్ రామస్వామి ప్రజా వైద్య సేవలో సేవా కార్యక్రమాలలో ముందుంటారని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆయురారోగ్యాలతోటి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
