తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస

తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యాంజలి 2.0 కార్యక్రమం తవణంపల్లి ఎంఈఓ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం డీఈవో మాట్లాడుతూ ఎస్ఎంసి సభ్యులు పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని, తరచూ ఉపాధ్యాయులు ఎస్ఎంసి కమిటీ సభ్యులు తో సమావేశాలు నిర్వహించి పాఠశాల, విద్యార్థుల పట్ల అవగాహన కలిగే విధంగా, చూడాలని ప్రభుత్వం చేపట్టిన విద్యాంజలి కార్యక్రమం సమాజానికి పాఠశాలకు వారధిగా నిలుస్తుందని తెలియజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి మరియు రిసోర్స్ పర్సన్ లు భువనేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పిలు, ఎస్ఎంసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *