బంగారుపాళ్యం-జనవరి 27 మన ద్యాస
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఏ.పి.టీ.డబ్ల్యు.ఆర్.గురుకుల పాఠశాలలో (బాయ్స్) వాచ్ మెన్ గా ఆనంద్ విధులు నిర్వ హిస్తున్నారు.గత 25సం||లు గా ఆశ్రమ పాఠశాల,విజిలాపురంలో నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ చేతుల మీదుగా 77వ గంతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు పోలీసు పేరేడ్ మైదానం “ప్రశంసాపత్రం” అందజేశారు.అందుకుగాను మంగళవారం మండలంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆలూరు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది ఆనందను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.