బంగారుపాళ్యం జనవరి 27 మన ధ్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థామస్ అల్వా ఎడిషన్ బల్బ్ కనిపెట్టిన రోజును మేము ఎలెక్ట్రిషియన్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని మా ఎలెక్ట్రిషియన్ ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవిస్తమని తెలిపారు.అలాగే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, బంగారుపాళ్యం ఎలక్ట్రికల్ మరియు ప్లంబర్ ప్రైవేట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ రెడ్డి,ఉపాధ్యక్షులు హేమశేఖర్ రెడ్డి, కార్యదర్శి గణపతి, కోశాధికారి వంశీ,కార్యనిర్వహణ సభ్యులు గిరి, బాలకృష్ణ, మహేష్, వినీత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *