
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం లో కళాశాల విద్యార్థుల శిబిరంలో వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లో పిఠాపురం రామచంద్రరావు గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధన్ అధ్యక్షతన మరియు వి ఎస్ ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ సారధ్యంలో మరియు భారతీయ జనతా పార్టీ పూర్వ ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొనియున్నారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు,ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యక్రమంలో కళాశాల విద్యార్థుల శిబిరంలో పాల్గొని దేశ అన్యోన్యతకు కృషి చేయాలని అదేవిధంగా దేశంలో తన వంతు సహాయంగా ఈ యొక్క కళాశాలలో పాల్గొని కాకినాడ కైట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల శిబిరంలో పాల్గొని దేశ అన్యోన్యతకు పాల్పడాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరడం జరిగినది . ఈ యొక్క కార్యక్రమంలో గొల్లపూడి గణేష్, గోరక్షణ విభాగ మరియు బోనుమంతి శ్రీనివాస్,నాగ జగదీష్, జగ్గంపేట కానీ ఖండ సేవా ప్రబుక్, రామకుర్తి సూర్యనారాయణ, దొంతంశెట్టి సుబ్రహ్మణ్యం, తదితరులు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు