మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: బాలిక దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ హెల్త్ సెంటర్ అధికారిణి డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతు బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యంగా అత్యున్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత పదవులు చేపట్టాలని బాల్యవివాహాలను పూర్తిగా రూపు మాపాలని తెలిపారు. బాల్య వివాహాలు పూర్తిగా నివారించాలని బాల్యవివాహాలు అలాగే రాజ్యాంగంలో బాలికల కోసం మహిళల కోసం రూపొందించినటువంటి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రతి బాలిక బడి బయట కాకుండా బడిలో ఉండాలని బాలికలు మహిళలు చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందని కుటుంబంలో విద్యావంతరాలు ఉన్నప్పుడే కుటుంబం చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా సమాజంలో విద్యావంతులుగా గౌరవప్రదమైన స్థానాలు దక్కుతావని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అవకాశాలను బాలికలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వాటిని అమరుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయినీలు, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏఎన్ఎమ్స్, ఆశాలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *