
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : నేటి బాలికలే రేపటి మహిళా మణులని కాకినాడ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఎన్ ప్రశాంతి పిలుపునిచ్చారు.శనివారం జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మండలంలోని లింగంపర్తి జడ్పీ హైస్కూల్ నందు జరిగిన బాలికల దినోత్సవం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లలు దేశానికి గర్వకారణం అని రేపటి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చే ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం ,చదివిద్దాం, ఎదగనిద్దాం అనే నినాదాలను చేయించారు. జె అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు బి శ్రీకాంత్ మాట్లాడుతూ బాలికలు విద్యార్థి దశ నుండే దృఢంగా ఉండడం తద్వారా జీవితంలో ఎదురయ్యే సంఘటనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పి మాణిక్య కుమారి, హెల్త్ సూపర్వైజర్ కె దైవ కృప, హెల్త్ అసిస్టెంట్ పి నాని బాబు, ఎమ్ ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు ఉన్నారు.