
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి యువనేత నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఏలేశ్వరం ఎయిమ్ ఫర్ సేవా స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమం లో సుమారు 50 చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి
పార్టీ నీఅధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు గా లోకేశ్ నిరూపించారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు.పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర నూతన జవసత్వాలు అందించి, రాష్ట్ర ప్రజల ఆదరణను చూరగొంటున్న యువ నాయకుడు లోకేశ్ మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మామిడి లలిత, కౌన్సిలర్ లు ఎండగుడి నాగబాబు కోణాల వెంకటరమణ పెండ్ర శ్రీను,రాయుడు చిన్న, రుచి రమేష్, , కరోతు సత్యనారాయణ (గాంధీ),వాగు రాజేష్,జొనాడ వీరబాబు, కోరాడ కృష్ణ,సామంతుల గోపీ, నడిపల్లి శివ, బుర్ల మణికంఠ, పతివాడ అఖిలేష్, పంచదార్ల చిన్న,తదితరులు హాజయ్యారు