
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వరుపుల తమ్మయ్య బాబు పోటీ చేశారు. అయితే ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీనివాస్ తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం లింగంపర్తి గ్రామానికి విచ్చేశారు. తమ్మయ్య బాబు సతీమణి దుర్గ వేణి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. తమయ్యబాబు కుమారుడు వరుపుల సాయికిరణ్ తో కలిసి తమ్మయ్య బాబు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య కార్యకర్తకు సైతం అండగా నిలిచే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తమ్మయ్య బాబు కుటుంబానికి కచ్చితంగా అండగా నిలుస్తారు అని హామీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ లతో కలిసి తమ అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి రమేష్ బాబు కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
