
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ; ఏలేశ్వరం పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నప్పటికీ, అధికారులకు కానీ ఏమీ పట్టకపోవడం విడ్డూరం.ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర్లో మెయిన్ సెంటర్ అయిన బాలాజీ చౌక్ కి మధ్య పంట కాలవ ప్రవహిస్తూ ఉంటుంది. కాలువ పక్కనే నగర పంచాయతీ అధికారులు ఏర్పాటు చేశారు డంపు లో ఉన్న వ్యాపారస్తులు తమ తమ వ్యాపార సంబంధించిన ప్లాస్టిక్ కవర్లను పేపర్లు డంపులో కాకుండా రోడ్డుపై వేయడంతో అధికారులు పట్టించుకోకపోవడంతో. అవి కాస్త ఉదయాని కల్లా మెయిన్ రోడ్డు మీదకు సగం వచ్చేస్తుంది.. పంచాయతీ సిద్ధం సిబ్బంది తెల్లవారుజామున ఆ వేస్టేజ్ అంతా ట్రాక్టర్లోకి డంప్ చేసి అక్కడ నుండి తరలించి, క్లీన్ గా ఉంచుతారు. అయితే గత రెండు రోజులుగా ఆ చెత్తని నగర పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది క్లీన్ చేయకపోవడంతో, ఆ చెత్త రోడ్డు మధ్య వరకు చేరి , పాదచారులకు, ఆ రోడ్డును పోయే వాహనదారులకు దుర్వాసన తెప్పిస్తూ చంద్రవదంగా తయారైంది. అయినప్పటికీ అధికారులు కానీ, ఈ ప్రధాన కూడలిలో ఉన్న ఈ చెత్తను తొలగించకపోవడం శోచనీయం. నగర పంచాయతీలో ఇంటి పన్నులు, నీటి పన్ను, ఖాళీ స్థలం పనుల, మీద విపరీతంగా పెంచేసి ప్రజలకు కనీస సదుపాయాలలో ఈ నిర్లక్ష్య వైఖరి ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై దృష్టి చారిని సాధించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.