మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంతూర్పు లక్ష్మీపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి సత్యరాణి నాగ భార్గవి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకుపలువురు నాయకులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పై మార్పులను అధికారులు గ్రామ ప్రజలకుఅవగాహన కల్పించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రామ్ జి గా మార్చారని తెలిపారు. ఇప్పటి వరకూ 100 రోజుల పని దినాలను 125 రోజులు పెంచారని అన్నారు.వికసిత్ భారత్ జి రామ్ జి కొత్త చట్టం ప్రకారం ఉపాధి కార్మికులకు సకాలంలో వేతనాలు అదేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందని అన్నారు. శక్తి వంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాలలో పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తూర్పు లక్ష్మీపురం గ్రామాన్ని చెత్త రహిత సుందర గ్రామంగా తీర్చి దిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ది అధికారి ఆర్ వీరాబాబు. ఎంపీటీసీ ఇజ్జనగిరి ప్రసాద్, ఉప సర్పంచ్ బూరెల అప్పారావు, వార్డు సభ్యులు రౌతు శ్రీనివాస్, నైనాలశెట్టి బృహత్, చందక వీరలక్ష్మి, కూటమి నాయకులు వీరంరెడ్డి దొరబాబు, పతివాడ వెంకటేశ్వరరావు, గంగిశెట్టి సత్యనారాయణ, వీరంరెడ్డి మంగాదేవి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి, ఆశ, వెలుగు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *