ఘనంగా మలయాళ స్టార్ జోజు జార్జ్ “పని” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న తెలుగులో గ్రాండ్ రిలీజ్.

Mana Cinema:- రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా “పని” తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోతెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ – పని సినిమా మలయాళంలో రిలీజ్ మంచి విజయాన్ని సాధించింది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా మిత్రుడు రాజ వంశీ తీసుకొస్తున్నారు. జోజు జార్జ్ మంచి నటుడు. ఆయన ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పని సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించాలి, రాజ వంశీతో పాటు టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – మలయాళ సినిమా అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వాళ్లు కంటెంట్ ను గౌరవిస్తారు. అందుకే మంచి విజయాలు సాధిస్తున్నారు. పని సినిమా కూడా అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న మూవీ. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు.నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – రాజవంశీ నాకు మంచి మిత్రులు. జోజు జార్జ్ గారికి నేను అభిమానిని. ఆయన మూవీస్ ఓటీటీలో చూస్తుంటాను. ఎప్పుడెప్పుడు ఆయనను కలుస్తానా అనుకున్నాను. ఈ వేదిక మీద కుదిరింది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడా ఆకట్టుకోగల నటుడు. అభినయ మనల్ని ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. వీరు కలిసి నటించిన పని సినిమా తన పనితనం ఎంటో తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా చూపించాలి అన్నారు.మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ – పని చిత్రంతో జోజు జార్జ్, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగింది. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని కోరుకుంటున్నా అన్నారు.నటి అభినయ మాట్లాడుతూ – పని చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఎక్సలెంట్ ఫిల్మ్. జోజు జార్జ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ జోజు జార్జ్ గారు తన ప్రతిభ చూపించారు. నాతో పాటు మా టీమ్ అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చిందీ సినిమా. తెలుగులో “పని” సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా అన్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ – వర్క్ ఈజ్ గాడ్…మనం చేసే పని మనకు దేవుడు. పని సినిమాను తెలుగులోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ గారు నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీలో రావడం లేదు. తెలుగులో థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. మీరంతా పని చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ – ఈ రోజు మా పని సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. వాళ్లు నా గురించి గొప్పగా మాట్లాడటం సంతోషంగా ఉంది. నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. పని సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మా టీమ్ లోని ప్రతి మెంబర్ తన వర్క్ ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. పని మూవీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. మీరంతా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.ఈ కార్యక్రమంలో పని సినిమాలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు.*నటీనటులు* – జోజు జార్జ్, అభినయ, సాగర్ సూర్య, జునైద్, అభయ హిరణ్మయి, సీమ, బాబీ కురియన్, తదితరులు*టెక్నికల్ టీమ్*బ్యానర్ – అప్పు పతు పప్పు ప్రొడక్షన్ హౌస్డీవోపీ – వేణు ఐఎస్ సీ, జినో జార్జ్ఎడిటర్ – మను ఆంటోనీమ్యూజిక్ – సామ్ సీఎస్, విష్ణు విజయ్పీఆర్ఓ – చందు రమేష్తెలుగు రిలీజ్ – ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజ వంశీదర్శకత్వం – జోజు జార్జ్

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు