
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఇటీవల ఆకస్మిక మృతి చెందిన న్యాయవాది బాధ జానుబాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులన్నారు. ఈ మేరకు ఏలేశ్వరంలోని జానుబాబు నివాసంలో న్యాయవాదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు మాట్లాడుతూ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా జాను బాబు కుటుంబానికి రావలసిన నిధులను వెంటనే మంజూరు చేయిస్తామని, కుమార్తె చదువుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిట్టంశెట్టి పుల్లయ్య, బుగతా శివ, న్యాయవాదులు అవసరాల దేవి, బి మధుబాబు, పలివేల నాగేంద్ర రాజు, ఏ మల్లేశ్వరరావు, బి అశోక్, జి కిషోర్, ప్రసాద్, న్యాయవాద గుమస్తాలు ఉన్నారు.