
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు మహిళా సాధికారత సెల్ ఆద్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త,ఉపాధ్యాయిని,రచయిత్రి అని ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్యని,కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణని.నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారని. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని,పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఆనాటి సమాజపు కట్టుబాట్లను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12 న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారని.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తప్పని ధీశాలని.కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారని.1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె.దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమేనని.వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారని.అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొబడ్డారని.అయిన పట్టువదలక పోరాటం చేశారని తెలియజేశారు. ఆమె స్పూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని అసమానతలు లేని సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. భీమునిపట్నం డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు డి మాధురి సావిత్రిబాయి ఫూలే జీవిత విశేషాలు ఆన్లైన్ ద్వారా విద్యార్డులకు తెలియజేశారు, ఈ కార్యక్రమమలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.వేంకటేశ్వర రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ, వి రామరావు, వీరభద్రరావు,ఎస్‌కే మదీనా, శ్రీ లక్ష్మి,మేరి రొసిలిన పుష్పా,సతీశ్ పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.