

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాకపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల్లో అడవి పందులు మరియు ఇతర జంతువుల వేటాడడం కొరకు కరెంట్ వైర్స్ పెడుతున్నారనే సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మికాంతం విచారణ చేపట్టారు.పోతులూరు గ్రామానికి చెందిన మడికి సూరిబాబు,లంపకలోవ గ్రామానికి చెందిన చిన్నిం జయబాబు కలిపి వాకపల్లి గ్రామంలో అడవి పందుల కోసం వ్యవసాయ భూముల్లో కరెంట్ వైర్లు పెడుతున్నారని విచారణలో తేలగా వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేసి వారిని ప్రత్తిపాడు మండల తహసీల్దార్ కి రెండు లక్షల రూపాయలకి బైండోవర్ చెయ్యడం జరిగిందని ఎస్సై ఎస్.లక్ష్మికాంతం తెలిపారు.అడవి పందులతో పాటు ఏ ఇతర జంతువులని వేటాడడం కొరకు గ్రామాల్లో కానీ,వ్యవసాయ భూముల్లో కానీ కరెంట్ వైర్లు పెట్టడానికి ప్రయత్నించిన,పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.మీ గ్రామాల్లో ఇటువంటివి జరుగుతున్నాయని తెలిస్తే మీ దృష్టికి వచ్చిన వెంటనే తెలియపర్చాలని అన్నారు
లక్ష్మికాంతం అన్నారు.