తవణంపల్లి డిసెంబర్ 31 మన ద్యాసరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం, తవణంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ,అనంతరం నాయకులకు,కార్యకర్తలకు, ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి,చిత్తూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి సునిల్ చౌదరి, ఏఎంసి చైర్మన్ భాస్కర్ నాయుడు, మండల ప్రధానకార్యదర్శి గాంధీ,తెలుగుయువత అధ్యక్షులు గోపి యాదవ్,క్లస్టర్ ఇన్చార్జులు ఎం ఆర్ సి మోహన్ నాయుడు,ప్రవీణ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు దిలీప్ నాయుడు, ఏఎంసి డైరెక్టర్ జగదీష్,పట్నం లవ యాదవ్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
