మన ధ్యాస, కోవూరు, డిసెంబర్ 30 :సీనియర్ జర్నలిస్టు ప్రస్తుత నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ కొలనుకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు సోమవారం కోవూరు మండలం, కొత్తూరు రోడ్డు, శ్రీరామ్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి కొలనుకొండ రాజశేఖర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి , జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి , జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి , జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి కవరగి శ్రీలత, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు కలువ బాల శంకర్ రెడ్డి గారు, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేమారెడ్డి శివకుమార్ రెడ్డి , గాజుల మల్లికార్జున , జానా వెంకటేశ్వర్లు గౌడ్ , మావులూరు వెంకటరమణ రెడ్డి, జెట్టి శ్రీనివాసులురెడ్డి , గుండపనేని రవి తదితరులు పాల్గొన్నారు.
