మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 :క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. బిషప్ ప్రకాశం క్రీస్తు సందేశాన్ని వివరించారు.క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును, ఆనందాన్ని తీసుకురావాలని, కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటూ, సంతోషంగా గడిపే సమయం అని. పరస్పర గౌరవం, ప్రేమతో నిండిన వాతావరణం ప్రతి ఇంటా నెలకొనాలని..క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగ అని ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని… ఈ క్రిస్మస్ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు…అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకున్నట్లు మంత్రి నారాయణ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




