మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 26 :నెల్లూరు సంతపేటలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమములో శుక్రవారం నూతనంగా నియమించిన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు గా బీద రవిచంద్ర ప్రధానకార్యదర్శిగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డిని,నెల్లూరు నగర మేయర్ రూపుకుమార్ యాదవ్ ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ………….గత 35 సంవత్సరాలగా తెలుగుదేశం పార్టీలో తెలుగు విద్యార్థి విభాగం నుండి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వరకు అనేక హోదాల్లో ప పనిచేసే అవకాశం నాకు వచ్చింది అని అన్నారు.గత 13 సంవత్సరాల గా నెల్లూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆశీస్సులతో ,జిల్లా మంత్రులు,పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు,జిల్లా నాయకుల సహకారంతో 5 వ సారి ప్రధాన కార్యదర్శి గా నియమితులయ్యాను అని అన్నారు.అందరి ఆశీస్సులతో సుదీర్ఘ కాలం ప్రధాన కార్యదర్శి గా పనిచేసే అరుదైన గౌరవం నాకు దక్కింది.అనేకమంది యోదనియోధులతో కలసి పని చేసే అవకాశం నాకు వచ్చింది.వారి నుండి అనేక అంశాలను నేను నేర్చుకున్నాను అని తెలిపారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పెద్దలు ఆనం రామనారాయణరెడ్డి తో సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది.వారి సలహాలు,సూచనలతో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తాను అని అన్నారు.అదేవిధంగా జిల్లాల్లో ఉన్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకొని,పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర తో కలసి పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేస్తాను అని అన్నారు.నన్ను 5 వ సారి ప్రధాన కార్యదర్శి గా నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కి,నా నియామకానికి సహకరించిన జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పార్టీ నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *