

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 10 గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణ బద్ధులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థగత ఎన్నికల్లో భాగంగా బిజెపి బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నియోజకవర్గంలోని 84 బూత్ స్థాయి బీజేపీ సమావేశం బిజెపి గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్చార్జి గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 84 బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయభాస్కర్ ను ఏకగ్రీవంగా ఏనుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధివిధానాలు నచ్చి బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవ రావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయులు, విగ్రహాల కళ్యాణి, విద్వాన్ కస్పా పద్మనాభం, మల్లారపు మనికంట్,మైనార్టీ మోర్చా బిజెపి నాయకులు మస్తాన్, శక్తి కేంద్ర బిజెపి ప్రముఖులు కామోష్ బాబు, ప్రసాద్, లక్ష్మయ్య, వీరంబాయ్ వాసు, శ్రీకాంత్, రహీం భాయ్, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.