
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ లో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతూ పట్టణంలో 28 కేంద్రాలు 2 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి బస్ స్టాండ్ మొదలగు ప్రాంతాల్లో 0.5 గల2359 మంది పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయడం జరిగిందని అన్నారు.దేశంలో పోలియోను పూర్తిగా తరిమికొట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.రెండు చుక్కలు అనే నినాదంతో నేడు రాష్ట్రంలో పోలియో రహిత దిశగా అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. పోలియో దాదాపుగా అంతరించింది.మిగిలి ఉన్న కొద్దిపాటి ముప్పును కూడా తొలగించేందుకు ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ప్రతి ఒక్కరూ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్,ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు,అంగన్వాడి వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు