మన ధ్యాస ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ స్వామివారి దేవస్థానం నందు శని వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది, దేవస్థానం నూతన అన్నదాన భవనం నందు ఈ.వో పెంచల కిషోర్, మరియు దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, దేవస్థానం సిబ్బందితో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీగా బయలుదేరి ఆలయ మాడా వీధులు, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో తిరిగి ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో సాగర్ బాబు, ఏఈఓలు ధనంజయ, ప్రసాద్, ధనపాల్, సూపర్డెంట్లు, శానిటారీ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.