
*9వవార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు
రోగులకుపలు సేవా కార్యక్రమాలు*
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం హాస్పిటల్ అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన దేవర్ష్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ విజయ,అంజి నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు అలాగే అన్ని రకాల వైద్య పరీక్షలకు రాయితీ కల్పించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సదుద్దేశ్యంతో తొమ్మిదేళ్ల క్రితం స్థాపించిన దేవర్ష్ హాస్పిటల్ నేటితో 9 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు.ఆరోగ్య సంరక్షణలో సాధ్యమయ్యే విధంగా ప్రజలకు సేవలు అందించడం,గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడం లక్ష్యంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.అలాగే తమ హాస్పిటల్ సేవలు ద్వారా ప్రతి కుటుంబంలో ఆరోగ్యం,ఆనందం,భవిష్యత్తును చూడడం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్నివేళలా అత్యవసర వైద్యంతో సహా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.అనంతరం తమ ప్రయాణంలో భాగస్వామ్యులైన వైద్య సిబ్బందిని ఈ సందర్బంగా వారు సన్మానించారు.