జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7
శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగిలో నవోదయ మోడల్ టెస్ట్ విజయవంతం
పెదమేరంగి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ సత్య కైలాస్ స్కూల్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగి వారు నిర్వహించిన మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 148 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు.
ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రధాన విజేతలు: ప్రభుత్వ పాఠశాలల విభాగం:ప్రథమ ర్యాంకు: లావణ్య త్రిపాఠి ఎంపీపీ స్కూల్, పాత్రువానివలస ద్వితీయ స్థానం: ఉదయశ్రీ మండల పరిషత్ స్కూల్, లక్నాపురం. ప్రైవేట్ పాఠశాలల విభాగం: ప్రథమ ర్యాంకు: బంటు మిథున్ కుమార్. ద్వితీయ స్థానం: జి. గురునాథ్ శ్రీ సత్య కైలాస్ పాఠశాల తృతీయ ర్యాంకులు: బల్లంకి యశ్వంత్ మరియు టి. సుష్మిత. ఇంగ్లీష్ మీడియం విభాగం: ప్రథమ స్థానం: జే. నాగ శౌర్య. బహుమతి ప్రదానోత్సవం: విజేతలకు పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. రాజశేఖర్ రావు చేతుల మీదుగా షీల్డ్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి మోడల్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడానికి, ఒత్తిడిని అధిగమించడానికి, మరియు నవోదయ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇంచార్జ్ శ్రీ పి. హరికృష్ణ, శ్రీ జి. ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.








