జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోగల తిరుమల సాయి హైస్కూల్‌లో ఈ ఆదివారం జరిగిన జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగేపార్వతీపురం మన్యం జిల్లాల నుండి సుమారు 15 మండలాలకు చెందిన 400 మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు తరలిరావడం విశేషం. గత 20 సంవత్సరాలుగా నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించబడుతూ, వందలాది మంది విద్యార్థులు పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని ఎంఇఓ1 డి. గౌరు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ మెగా మోడల్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
జనరల్ విభాగం విజేతలు బహుమతులు బహుమతి విద్యార్థి పేరు పాఠశాల నగదు బహుమతిప్రథమ కొండగిరి లిఖిత కుమార్ తిరుమల సాయి హైస్కూల్ ₹3,000/-ద్వితీయ టీ. హర్ష వర్ధన్ వివేక్ ఆనంద స్కూల్, మక్కువ ₹2,000/-తృతీయ P. శ్యామ సుందర్ ఎంపీపీ స్కూల్ మక్కువ ₹1,000/- ప్రభుత్వ పాఠశాలల విజేతలు ఎస్. గోవర్ధన్ ఎంపీపీ స్కూల్ గరుగుబిల్లి జి.జస్విక ఎంపీపీ స్కూల్ శిఖబడి పి వివేక్ ఎంపీపీ స్కూల్సీతానగరం కె.ధన్వీత GPS, GL. పురం పి .శ్రీవాణి MPPS, మక్కువ ప్రైవేట్ పాఠశాలల విజేతలు
ఎస్. జ్ఞానేశ్వరి తిరుమల సాయి హైస్కూల్ కె.రాఘవ తిరుమల సాయి హైస్కూల్ పి.రష్మీ త (వివేక్ ఆనంద స్కూల్, బి జెపురం ఎన్ .జగత్ సాయి ప్రగతి హైస్కూల్, వీరఘట్టం ఎల్. దిలీప్ శంకర్ స్కూల్, ఎర్రన్న గుడి
వీరితో పాటు, సరస్వతి విద్యా నికేతన్, కురుపాం నుండి మరియు పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తిరుమల సాయి.








