9మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ అయిదో వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు.కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు.నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా లబ్ధిదారులకు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందించారు.ఇటీవల మృతి చెందిన పసుపులేటి బాబ్జి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి,దయనీయ స్థితిలో ఉన్న ఆమెకు 50 కేజీలు బియ్యం అందించి ఆమెకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి పని చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ,మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు,నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి,వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి,కౌన్సిలర్లు పెండ్ర శ్రీను,ఎండగుడి నాగబాబు,కోనాల వెంకట రమణ,లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్,ఏలేశ్వరం సిహెచ్సి చైర్మన్,వైస్ చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు,కూటమి నాయకులు కరణం సుబ్రమణ్యం,గాబు సుభాష్,గట్టెం వెంకట రమణ,రెడ్డి రాజు,రుచి రమేష్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.







