​రేణిగుంట:
శ్రీకాళహస్తి నియోజకవర్గ సీనియర్ నాయకులు,
రేణిగుంట మండలం ఆర్.మల్లవరం నివాసి చిన్నారెడ్డి ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారెడ్డి ని వారి నివాసంలో కలిసిన ఎమ్మెల్యే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం మరియు పార్టీ బలోపేతం కోసం చిన్నారెడ్డి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రస్తుత చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారెడ్డి త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
​అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అండగా నిలవడమే తన బాధ్యతని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి కి అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందించే విషయంలో తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *