

మన న్యూస్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన సిపిఐ జిల్లా నాయకులు మంగి వీరయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం ఆదివారం వీరయ్య నివాసానికి వెళ్లి వీరయ్యని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తిరుమలేష్, గణేష్ రెడ్డి, వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.