మన దాస్య,నిజాంసాగర్:( జుక్కల్ ) నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుంచి పిట్లం మండల కేంద్రం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజాపండరి గురువారం ఒకప్రకటనలో తెలిపారు.డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏలె మల్లికార్జున్,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతామన్నారు.అనంతరం పిట్లం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సన్మాన సభ ఉం టుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్త లు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.







