మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలసి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ డిసిసి జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కు శాలువాతో సన్మానించారు.అనంతరం డిసిసి జిల్లా అధ్యక్షుడికి సహకరించినందుకు ఎమ్మెల్యేకు ఏలే మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మదన్‌మోహన్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా నిరంతరం పని చేయాలని డీసీసీ అధ్యక్షుడికి సూచించారు.ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు.పార్టీ కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ప్రజలతో మమేకం అయ్యేలా కృషి చేయాలన్నారు. మల్లికార్జున వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి పటేల్,తదితరులు ఉన్నారు
