మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇస్తారా.. ఇవ్వరామామిడి రైతు సంఘం డిమాండ్

తవణంపల్లి నవంబర్ 16 మన ద్యాస

తవణంపల్లి మండల మామిడి రైతుల సమావేశం కే.మునిరత్నం నాయుడు అధ్యక్షతన ఎల్ మోహన్ రెడ్డి సమన్వయంతో జరిగింది ఈ సమావేశానికి జిల్లానాయకత్వంపాల్గొన్నారుఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వ ఆదేశానుసారం. గుజ్జు పరిశ్రమలు ఇవ్వాల్సిన ఎనిమిది రూపాయల బకాయిలను వెంటనే రైతుల ఖాతాలు లోకి జమ చేయాలని. గుజ్జు పరిశ్రమలకు మామిడి సరఫరా చేసిన 15 రోజులలోపే పేమెంట్ చేయాలనే నిబంధన వున్నా. ఆరు నెలలు కావస్తున్న రైతులకు ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం చూసి చూడనట్లువ్యవహరించడం దుర్మార్గమన్నారు.. ప్రభుత్వ 40 వేల మంది మామిడి రైతుల పక్షమా లేక40గుజ్జుపరిశ్రమలవైపా..తేల్చుకోవాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ. ప్రభుత్వ ఆదేశాలు అంటే అమలవుతాయనే ఆశతో నమ్మకంతో రైతుల ఉన్నారని. ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన జీవోలు దండగే అన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు ఇస్తాయా ఇవ్వవా…. ప్రభుత్వం తేల్చాలని. అలా ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోతే ప్రభుత్వమే ఇచ్చినజీవోను తగలబెట్టాలని. అలా చేయని పక్షంలో డిసెంబర్లో జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో రైతులే చేస్తారని తెలిపారు.. జిల్లా ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ. గత ఐదు సంవత్సరాలుగా మామిడి రైతులను రాంపులు దళారులు గుజ్జు పరిశ్రమలు మోసం చేస్తున్నాయని. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని. ఇక వీటి ఆటలుసాగకుండా అడ్డుకోవాలంటే మామిడి రైతులంతా ఏకం కావాలనితెలిపారు. మామిడి సంఘం కోశాధికారి సంజీవరెడ్డి . జిల్లా కార్యదర్శి సందీప్ మామిడి రైతుల ను ఉద్దేశించి తమ సందేశాన్ని అందించారు అనంతరం తవణంపల్లి మండలం మామిడి రైతు సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా..కే. మునిరత్నం నాయుడు. కన్వీనర్ గా. ఎల్ మోహన్ రెడ్డి. కమిటీ సభ్యులుగా… ఏ.దిలీప్ కుమార్ రెడ్డి. ఉదయ్ కుమార్ రెడ్డి. యూ.జనార్దన్ యాదవ్. టి. నారాయణ.టి.శివాజీ వి.రమణారెడ్డి.టీ. రవి.ఎస్.భాస్కర్ నాయుడు. సురేంద్ర రెడ్డి..తులసి రామాచారి..కమలాకర్. ముని వెంకట్రెడ్డి..నిరంజన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో. వివిధ గ్రామాల నుంచి మామిడి రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం