మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు.సకాలంలో బిల్లులు వస్తున్నాయా లేదా ఇంటి నిర్మాణం ఖర్చులు ఇసుక లభ్యత ఇతరత్ర విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది నిర్మించుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి,వెల్గనూర్ గ్రామలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు.రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలు డబ్బులు జమ చేయబడుతున్నాయని తెలిపారు. ట్యాబు ఎంట్రీ 100% చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాలల్లో మౌలిక వసతులు కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అలాట్మెంట్ చేసిన రైస్ మిల్ కు మాత్రమే లారీలను పంపాలని తగిన సూచనలు చేశారు.జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 195 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు,సొసైటీలో 234 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్,డిసిఓ రామ్మోహన్ రావు,డిసిఎస్ ఓ వెంకటేశ్వర్లు,ఎపిడీ వామన్ రావు,తహసిల్దార్ బిక్షపతి,ఎంపీడీవో శివకృష్ణ, ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఏఈఓ స్వర్ణలత, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి,సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి గంగసాగర్,నాయకులు బ్రహ్మం,అనీస్ పటేల్,మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *