మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 17,
ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పుస్తక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జె ఎన్ వి ప్రిన్సిపాల్ రాంబాబు అన్నారు.ఈ సందర్భంగా
నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ..పుస్తకాల చదువును ప్రోత్సహించడం, పఠన పరంపరను పెంపొందించడం,విద్యార్థుల వయోజనుల్లో చదవు అలవాటును పెంచడం ప్రధాన ఉద్దేశ్యం,ఈనెల 18వ తేదీ ఆదర్శ పాఠశాల గ్రంథాలయం సందర్శిస్తామని తెలిపారు,19 వ తేదీ జె ఎన్ విలో పుస్తక ప్రదర్శన ఉంటుందని,20 తేదీన జె ఎన్ వి లో క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోగ్రంథపాలకులు సందీప్ ఉన్నారు.









