

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు ముందస్తు అరెస్టు బహుమతి ఇచ్చిన ఎమ్మెల్యే
ఇది జూకల్ ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుంది. తన గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకి, కార్యకర్తలకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేస్తూ అరుదైన వార్షిక బహుమతి ఇచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాక సందర్భంగా, ముందస్తుగా జుక్కల్ బ్ నియోజకవర్గంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేవలం భరాసాన్ని ఎలాగైనా ఓడించి జుక్కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇక్కడ అభివృద్ధి జరగాలి అనేక ఇబ్బందులకి గురి అవుతున్న తమ కార్యకర్తలు నమ్ముకున్న ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతోనే అనామకుడిగా నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ని నమ్మి నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకి స్వయంగా భరోసా ఇస్తూ పరిచయం చేసి అనేక ఒత్తిళ్లు అవమానాలు ,బెదిరింపులకి గుడి అవుతూ ఎమ్మెల్యే గా గెలిపిస్తే తమ గెలుపు అని భావించి నిద్రాహారాలు మాని మొదటి నుండి కష్టపడి నాయకులు కార్యకర్తలను శనివారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గానికి వస్తున్న కారణంగా ప్రతిపక్ష నాయకులని ముందస్తు అరెస్టు చేసినట్టు కష్టపడ్డ కార్యకర్తలని అరెస్టు చేయించారు.భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొత్త, వింత పనికి శ్రీకారం చుట్టారు తనకోసం ఒక సమయానికి సొంత కుటుంబాన్ని సహితం పక్కనపెట్టి తామే ఎమ్మెల్యేగా నిలుచున్నాము అన్న విధంగా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను ప్రైవేటు అరెస్టు చేయించారు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లలో బారాస అలాగే పార్లమెంట్ ఎలక్షన్లలో బిజెపి నుండి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు లేకుండా చేయాలని తిరిగిన నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాలికింద వేసి తొక్కుతున్నటుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ తనకోసం పనిచేసిన నాయకులు గానీ కార్యకర్తలు గాని ఏదైనా సమస్య లేదా ఏదైనా పని గురించి అడిగితే వారిని ఎటువంటి డిమాండ్ చేయలేరు .కాబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లో ఉన్న దళారులు , ఓటు కూడా వేయని నాయకులను పక్కన పెట్టుకుంటే తను ఇష్టారాజ్యంగా ఏదైనా చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు.ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేకి కనీసం ఓటు కూడా వేయలే కాబట్టి బొమ్మల్లా ఉంటారని ప్రతిపక్ష నాయకులు , సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
అరెస్ట్ అయిన వారిలో మాజీ జడ్పీటిసి జయప్రదీప్, మాజీ జడ్పిటిసి కమల్ కిషోర్,మండల అధ్యక్షులు సంజీవ్ పటేల్, ఎక్స్ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపిటిసి సురేష్, మాజీ సర్పంచ్ వినోద్, మాజీసర్పంచ్ విట్టల్ రావు పటేల్ మాజీ ఏఎంసి చైర్మన్ సంగమేశ్వర్ వారితో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మన న్యూస్ దినపత్రికకు జయప్రదీప్ చరవాణి ద్వారా మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో వస్తున్న మంత్రిని మేము ఎందుకు అడ్డుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను తీసుకువచ్చి వర్షాలు చేయించి నిలబడి ఎమ్మెల్యే ను గెలిపిస్తే మాకు ఈ విధంగా చేయడం సరికాదని ఆయన అన్నారు. ముందస్తుగా అరెస్టు విషయంపై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.