

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నారాయణాఖేడ్ మండలంలోని చప్తా కే గ్రామానికి చెందిన గంగాపురం మోహన్ రెడ్డి 56,వేల రూపాయల సీఎం సహాయనిది మంజూరైన చెక్కును ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ బాధిత కుటుంబానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజల్లోకి దూసుకెళుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు ఖాయం అని అన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గంగయ్యస్వామి, మాజీ ఎంపీటీసీ మారుతీ నాయక్ తదితరులు ఉన్నారు.