మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అనుమాన భూతంతో భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్,పెద్దకొడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్ ల్ మండలం విఠల్ వాడీతండాకు చెందిన పవర్ కిషన్(45)కు ఇదే మండలం పోచారంతండాకు చెందిన సవిత (42)తో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.కొన్నేళ్లుగా వారు హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతంలో టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగి స్తున్నారు.భార్య సవిత ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో కిషన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.ఎలాగైనా ఆమెను చంపాలని పథకం వేసుకున్న కిషన్.. సవితను గుడి పండుగ కోసం అని విఠల్ వాడీతండాకు తీసుకొచ్చాడు. 23వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో సవిత తలపై రోకలి బండతో బాదాడు.కత్తెరతో పొడిచాడు. అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రరక్తస్రావమవుతున్న సవితను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు.ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ,పెద్దకొడప్తల్ ఎస్సై.. నిందితుడిని విచారించగా సవితను తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు.హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *