మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం బీమ్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరయోధుడు కొమురం బీమ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
₹ఈ సందర్భంగా కొమురం బీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు.అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య మాట్లాడుతూ..కొమురం బీమ్ ఆత్మస్ఫూర్తి ప్రతి ఆదివాసి యువతలో చైతన్యాన్ని నింపాలి.ఆయన చూపిన మార్గంలో నడిస్తే మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భూమయ్య, రాజు, సంతోష్, సాయిలు, సాయిరాం, గ్రామ పెద్దలు రాములు, హన్మగౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.








