మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు.నిర్మాణ పనుల నాణ్యతను,పురోగతిని వివరంగా ఆరా తీశారు. అధికారులు,కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ప్రతి అర్హుల కుటుంబం గడువు లోపు గృహం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం.నాణ్యత ప్రమాణాలకు భిన్నంగా పనులు జరగకూడదుఅని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు సంతోష్ రాథోడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి గౌరీ, సాయి ప్రణీత్,ఫీల్డ్ అసిస్టెంట్ గంగారాం,తదితరులు పాల్గొన్నారు.







