మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్),కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో,నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో గుల్ గుస్తా లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్‌పాల్ సింగ్ ఖరోలా హాజరయ్యారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అబ్జర్వర్ రాజ్‌పాల్ సింగ్ ఖరోలాను ఆత్మీయంగా స్వాగతించి,శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ —
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీకి కష్టపడే,సామాన్య కార్యకర్తలతో కలసి పనిచేసే నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది.ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది అన్నారు.అలాగే పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకులు,కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి పంపి తుది నిర్ణయం పార్టీ కేంద్ర అధిష్ఠానం తీసుకుంటుందని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం ద్వారా పార్టీ మరింత బలపడుతుంది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,హన్మంలు, రమేష్ దేశాయ్, బస్వత్ రాజు పటేల్,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రాజ్,గుర్రపు శ్రీనివాస్,అనీస్ పటేల్,తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *