శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక కే.జీ.బీ.వీ విద్యాలయంలోమంగళవారం మరియు బుధవారం రోజులలో “సూపర్ GST సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అప్పలరాజు, వై. అనంత సత్య, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్ ఎంపీడీఓ జి. కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జి. కిషోర్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన GST విధానం ప్రజలకు లాభదాయకంగా మారింది. తగ్గిన పన్ను రేట్లతో సాధారణ వినియోగదారులకు ఉపశమనం లభిస్తోంది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో వినియోగించే వస్తువులపై పన్ను రేట్లను తెలుసుకుని అవగాహన పెంపొందించుకోవాలి. పారదర్శక వ్యాపారం, సరైన టాక్స్ చెల్లింపు ప్రతి పౌరుని బాధ్యత” అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో GST పై చైతన్యం పెంచేందుకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలలో విజేతలకు స్మారక బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ బాలామణి మాట్లాడుతూ, “ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహనను పెంపొందిస్తాయి” అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.









