జలదంకి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్):///
నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయితీలో ఇదివరకు ఐదు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్నాయి వాటిల్లో కొన్ని గ్రామాలు వేరు చేసుకోగా హనుమకొండ పాలెం గ్రామస్తులు గ్రామస్తులు కి అపోహలు కలిపించి మీకు ఇళ్ల స్థలాలు కానీ కాలనీలు కానీ రావు మీకు పంచాయితీ వేరు చేస్తాము అని వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది టిడిపి నాయకులు కలిసి గ్రామస్తులు వారి చేత వాళ్ల వారికి తెలియకుండా సంతకాలు సేకరించి ప్రజల్ని మోసం చేయాలని,చూస్తున్నారు.హనుమకొండ పాలెం గ్రామస్తులు లక్కు నాగిరెడ్డి మాట్లాడుతూ మాకు ఎటువంటి పంచాయతీ మార్పు చేయాల్సిన అవసరం లేదు మాకు బ్రాహ్మణ కాక పంచాయతీలోని ఉండాలని గ్రామస్తులందరూ కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మండలంలోని ఎంపీడీవో కి గ్రామస్తులు అందరు కలిసి మాకు మాకు ఎటువంటి విభజన అవసరం లేదు అని క్లుప్తంగా రాసి వినతి పత్రం అధికారికి అందజేశారు. ఈ విషయాన్ని గ్రామంలోకి వచ్చి విచారించి ఇటువంటి తప్పుడు కార్యాలకు పాల్పడకుండా వారిని శిక్షించవలసిందిగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుచున్నారు.








