మన ధ్యాస న్యూస్ : సీతారామపురం (అక్టోబర్ 8):
అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టం ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీతారామపురం ఎస్ఐ శివ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టంను ఉపయోగించి, నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనంతో సహా సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని ఎస్ఐ శివ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. పర్మిషన్ పొందినవారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడాలన్నారు.పండగలైనా, పెళ్లిళ్లైనా డీజే మోతలు లేనిదే వేడుక జరగడం లేదు. కానీ, ఈ శ్రుతిమించిన సంగీతం పెను విషాదాలకు కారణమవుతోంది.నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 65 డెసిబెల్స్ మించి శబ్దం ఉండకూడదు. మానవ కర్ణానికి 85 డెసిబెల్స్ దాటిన శబ్దం అత్యంత ప్రమాదకరం.ఆసుపత్రులు, పాఠశాలలు, న్యాయస్థానాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో డీజేలకు అనుమతి లేదు.








