
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ శ్రేణులు కంటి, దంత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా మోదీ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ప్రజాసేవకుడిగా మోదీకి ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది అన్నారు . ఈ సందర్భంగా ఏలేశ్వరం బిజెపి మండల అధ్యక్షులు ఏనుగుల ధర్మరాజు మాట్లాడుతూ గత నెల17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం, ప్రభుత్వ ఆసుపత్రిలో, పండ్లు పాలు, రొట్టెలు పంచిపెట్టడం జరిగిందని అన్నారు. శుక్రవారం లింగంపర్తి గ్రామంలో నూకాలమ్మ గుడి వద్ద మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ శిబిరానికి సుమారు 200 మందికి కళ్ళు, దంతాలు పరీక్షలు చేసే ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో. గరీకి నాగరాజు, గడ్డం సత్తిబాబు, ముందుకుట్టి దేవి శ్రీ ప్రసాద్, పి వి వి సత్యనారాయణ, గరికి చక్రి, పోనిశెట్టి రాజేశ్వరి, దొంకే లావరాజు తడితలు పాల్గొన్నారు









