శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ శ్రీ పీఠం లో విజయదశమి దేవీ శరన్న నవరాత్రులు సందర్భంగా జరుగుచున్న మహాశక్తి యాగం, హెూమములు, విశేష పూజ,శతకోటి కుంకుమ పూజ, లక్ష నిమ్మకాయల పూజలో ప్రత్తి పాడు నియోజకవర్గ వైయ స్సార్ సిపి నాయకులు & నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు & ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణం రాజు, మాజీ జడ్పీటీసీ ముదునూరి లోవలక్ష్మి, పాల్గొని శ్రీ బగళాముఖిదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజ అనంతరం ముదునూరు మురళి కృష్ణంరాజు మాట్లాడుతూ, విజయదశమి సందర్భంగా కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం పొందుకోవాలని ఆకాంక్షించారు. భవాని మాల వేసిన ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ వెళ్ళు భక్తులు రాత్రి వేళల్లో సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలని ముడుపులు చెల్లించి తిరిగి గృహాలు చేరుకునేంత వరకు ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.