

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఆలయం వెలుపల అంగళ్లు తలనీలాలు పార్కింగ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో వేలం పాటలు చిత్తూరు దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన, మొగిలి ఆలయ ఈవో మునిరాజులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గడచిన సంవత్సరం కన్నా తక్కువ మొత్తంలో వేలం పాట పాడడంతో, నిలిపివేయడం జరిగినట్లు, తదుపరి 15 రోజుల తర్వాత రెండవసారి వేలంపాట ప్రకటించనున్నట్లు ఈవో మునిరాజులు తెలియజేశారు.ఆలయం వెలుపల దేవాలయానికి సంబంధించి తలనీలాలు, పార్కింగ్ స్థలాలు,పాదరక్షకులు పెట్టడానికి రూమ్ కానీ, కొబ్బరి చిప్పల వేలం, వీటిపై సౌకర్యాలు తక్కువగా ఉన్నట్లు స్థానికులు ఆలయ ఈవో మునిరాజులుకు తెలిపారు. పై అధికారులకు పై తెలిపిన వాటిపై తగు చర్యలు తీసుకునే విధంగాప్రపోజల్ పంపాలని స్థానికులు తెలిపారు.అలాగే ఆలయానికి సంబంధించిన భూములు వందల ఎకరాల్లో ఉన్నా కానీ ఇంతవరకు ఏ ఏ భూములు ఎక్కడ ఉన్నాయో ఆలయ అధికారులు వెంటనే చూపించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త యం బి విజయ్ కుమార్,టెంపుల్ ఇన్చార్జి కుమార్,ఆలయ సిబ్బంది మధు, బాలాజీ,స్థానిక నాయకులు పాల్గొన్నారు.