శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెన్నా శివ పై ఒక దినపత్రికలో ప్రచురించిన అసత్య కథనాలపై శంఖవరం మండలం కత్తిపూడి తెదేపా నాయకులు మండిపడ్డారు.సుదీర్ఘకాలం నుండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ, రాష్ట్ర టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులుగా ఉన్నతమైన పదవులను చేపట్టి ప్రజల మన్నలని పొందుతూ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ గా ఇటీవల నూతనంగా నియమించిన వెన్నా శివ ఎదుగుదలను ఓర్వలేక తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని, తమ అభిమాన నాయకుడు పై లేనిపోని ఆరోపణలు రాస్తే సహించేది లేదని టిడిపి నాయకులు తెలిపారు. శంఖవరం మండలంలోని కత్తిపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ టిడిపి నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాల నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ కష్టకాలంలో నిలబడి ఎన్నో ఒత్తిడిలను, ఒడిదుడుకులను తట్టుకుని పార్టీ విజయానికి కృషి చేసిన తమ నాయకుడు శివను గుర్తి ంచి రాష్ట్ర టి ఎన్ టీ యుసి ఉపాధ్యక్షుడిగా నియమించడమే కాకుండా నూతనంగా రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్ గా నియమించడంతో ఆయన ఎదు గుదలను ఓర్వలేక కొంత మంది కావా లనే ప్రముఖ పత్రికలో లేనిపోని ఆరోపణలతో అవాస్తవాలను రాయించడం జరుగుతుందని, ఆ కథనానికి మా నాయకుడికి ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని, న్యాయబద్ధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గాబు కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ కంచిబోయిన శ్రీను, సాధనాల లక్ష్మీబాబు, నాయకులు రేలంగి జనార్ధన్ కొయ్యా రమణ, పోసిన చంటి, తోట అప్పారావు, నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు.