

మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: ///
డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి మరియు వారితోటి మండల కన్వీనర్ దేవరాల గంగాధర్, బిజెపి మండల కన్వీనర్ భోగాల మురళి రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి అంశాలపై చర్చించడం జరిగింది. అందుకు డిసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సానుకూలంగా స్పందించి తన తరఫున తన వంతు సాయం గా ఏ చిన్నపాటి అభివృద్ధికి ఐనా తనయొక్క సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మండవ రామ్మోహన్ నాయుడు, కుంకు రసూల్,తల్లపనేని శ్రీనివాసులు నాయుడు, మర్యాదపూర్వకంగా కలిశారు.