

ఉదయగిరి : (మన ద్యాస,ప్రతినిధి)నాగరాజు,సెప్టెంబర్ 08 :////
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వారీగా విషజ్వరాలు ఎక్కువ కావడంతో, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులుకు ప్రజలు క్యూ కడుతున్నారు. గత వారంలో కురిసినటువంటి వర్షాల వల్ల, దోమలు ఎక్కువగా రావడం, దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు, తీసుకోకపోవడం, అందరికీ తెలిసిన, తెలియనట్టు, మీ గ్రామాలకు వెళ్లాం, ప్రతి గ్రామంలో శానిటైజేషన్ చేసాం, అని గొప్పలు చెప్పుకుంటూ, ఏ గ్రామంలోనూ ఏ సమస్య లేనట్టు, నిమ్మకు నిరెత్తినట్లు, ఇటు మండల అభివృద్ధి అధికారులు కానీ, అటు గ్రామపంచాయతీ అధికారులు కానీ, ప్రజల జ్వరాలు పై స్పందించకపోవడం,సమంజసం అని మండల ప్రజలు కొనియాడుతున్నారు. అలాగే కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా వాడనటువంటి, గ్రామపంచాయతీలు, పల్లెలు, కో కొల్లలుగా ఉన్నాయని, ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే, అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు కొనియాడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో విష జ్వరాలు ఎక్కువ అవకుండా అరికట్టాలని, మండల ప్రజలు కోరుతున్నారు.